టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో తన 152వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే 50శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా కరోనా ఎఫెక్ట్‌తో ఆచార్య షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం కొంత తగ్గిన తర్వాత మే నుండి ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుందాని సమాచారం. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తాడని ఓ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయనకు భారీగా రెమ్యూనరేషన్ చెల్లించి.. దాదాపు రోజుకు ఓ కోటి రూపాయలు అన్నట్లు ఆ మధ్య విపరీంతగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. ”మొదటినుండి ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం కొరటాల చరణ్ నే అనుకుంటున్నారు. ఐతే మహేష్ పేరు ఎలా తెరమీదకు వచ్చిందో నాకు తెలియదు. మహేష్ నాకు బిడ్డతో సమానం, అతనితో కలిసి నటించడం నాకు ఆనందం కలిగించే అంశమే. కానీ ఈ చిత్రం కోసం మహేష్ ని అసలు అనుకోలేదని.. సురేఖ కూడా చరణ్ ఈ మూవీలో నటించాలని కోరుకుంది అని స్పష్టం చేశాడు మెగాస్టార్. అయితే ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆచార్య కోసం చరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలి. ఇది కుదరాలంటే కొరటాల శివ, రాజమౌళి కాంప్రమైజ్ అవ్వాలి.. అప్పుడే ఇది సాధ్యం అవుతుందని ఆయన పేర్కోన్నాడు. ఇక ఆచార్యలో ముందునుండి త్రిషను అనుకుంటే ఆమె ఏవో కారణాల వల్ల తప్పుకుంది. దీంతో కాజల్‌ను తీసుకుంది చిత్రబృందం. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.