HomeTelugu Big Storiesమెగాస్టార్‌ కీలక నిర్ణయం

మెగాస్టార్‌ కీలక నిర్ణయం

Chiranjeevi Digital Entry
మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. మోహన్‌ రాజా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న’గాడ్‌ఫాదర్‌’ మూవీ విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్న ‘భోళాశంకర్‌’ షూటింగ్‌ కూడా వేగంగా జరుగుతోంది. ఇక బాబీ దర్శకత్వం తెరకెక్కే చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. వీటితో పాటు మరో రెండు సినిమాలకు లైన్‌లో ఉన్నాయి అని.. తర్వలో అధికారికంగా ప్రకటిస్తారు అని తెలస్తుంది‌. ఇలా వరుస సినిమాలతో ఫుల్‌ బీజీగా ఉన్న చిరంజీవి.. తాజాగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తునాయి. త్వరలోనే ఆయన డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారట.

ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్‌ కంటే ఎక్కువగా ఓటీటీల వైపే మొగ్గచూపుతున్నారు. దీంతో బడా హీరోలు సైతం ఓటీటీ సినిమాలకు, వెబ్‌ సిరీస్‌లకు సై అంటున్నారు. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓటీటీ కోసం వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొన్ని ఓటీటీ సంస్థలు చిరంజీవిని సంప్రదించినట్లు టాక్‌. వారి దగ్గరు ఉన్న కొత్త కాన్సెప్ట్‌లను కూడా వినిపించారట.

అయితే తన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తన క్యారెక్టర్‌ చాలా ఫవర్‌ఫుల్‌ ఉండేలా కథను సిద్ధం చేసుకొని రమ్మని చెప్పారట. చిరు ఓటీటీ ఎంట్రీ అంటే మాములు మాటలు కాదు. ఆయన రేంజ్‌కి తగ్గ కథ ​దొరకాలి. మరి మెగాస్టార్‌కు నచ్చే కంటెంట్‌ని ఏ ఓటీటీ సంస్థ అందిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!