మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహ వేడుకల్లో మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేస్తుంది. ఉదయ్‌పూర్ లో నిహారిక- చైతన్య పెళ్లి జరుగుతున్న సంగతి తెలిసిందే. సంగీత్ వేడుకల సందర్భంగా మెగా ఫ్యామిలీకి చెందిన అందరూ సందడి చేశారు. ఇక ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ దంపతులు డాన్స్ చేశారు. చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ‘బంగారు కోడిపెట్ట’ పాటకు చిరు దంపతులు చేసిన డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. అంతేకాదు… అల్లు అరవింద్ దంపతులు కూడా ‘రామ్మా చిలకమ్మా’ అనే పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. మరోవైపు ‘గ్యాంగ్ లీడర్’ పాటకు నాగబాబు, చైతన్య, నిహారిక డ్యాన్ చేశారు. ఇక అల్లు అర్జున్ కూడా చిరుతో చిందేశాడు. ఈ మెగా వేడుకలు అభిమానులకు మంచి జోష్‌ని ఇస్తున్నాయి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram