chiranjeevi: విశాఖపట్నంలో నేడు లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి, ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య అవార్డుల ప్రధానోత్సం జరగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్నార్ గార్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎన్టీఆర్ తో జరిగిన ఓ సంఘటనని, ఆయన ఇచ్చిన ఓ సలహాని గుర్తుచేసుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. నా కెరీయర్ ప్రారంభంలో.. ఒక రోజు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లినప్పుడు.. ఆయన ఒక సలహా ఇచ్చారు.
మీరు సంపాదించిన డబ్బు అంతా ఇనుప ముక్కలు మీద పెట్టొద్దు, ఏదైనా మంచి ఇల్లు కట్టుకోండి, స్థలాల మీద పెట్టుకోండి మనల్ని కాపాడేది అదే అన్నారు. మనం ఎక్కువ కాలం ఇలాగే స్టార్ డమ్ తో ఉంటామని అనుకోకండి అని ఎంతో ముందుచూపుతో చెప్పారు.
ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత కార్ కొనడం ఆపేసి అక్కడక్కడా స్థలాలు కొనడం మొదలుపెట్టాను ఈ రోజు నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నిలబెట్టాయి. అవే ఈరోజు నన్ను, నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి అని చెప్పారు.
ఈ నేపథ్యంలో నా బయోగ్రఫీ గురించి కూడా స్పందించాడు. ఇప్పుడు నాకు బయోగ్రఫీ రాసే సమయం లేదు కాబట్టి ఆ బాధ్యతని యండమూరికి అప్పగిస్తున్నాను అని ప్రకటించాడు. అంత సామర్ధ్యం ఒక్క యండమూరి కే ఉందని అని అన్నారు. ప్రస్తుతం చిరంజీవి కామెంట్స్ వైరల్ గా మారాయి.