మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్యాన్సర్ బారినపడ్డానని, ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికానన్నారు. స్టార్ హాస్పిటల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తాను ఆరోగ్యంగా ఉంటానని అనుకుంటానని, రోజు ఎక్సైర్‌సైజ్ చేస్తుంటానని, హెల్తీఫుడ్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటాను, నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు.. నాకు ఏ జబ్బురాదులే అనుకుంటాను.
ఏ బ్యాడ్ హాబిట్స్ లేవ్. ఎప్పుడో స్నేహితులతో వైన్ తీసుకుంటాను. స్మోకింగ్ అలవాట్లు లేవు. దాంతో ఎలాంటి క్యాన్సర్ రాదు అనుకోవడానికి లేదు. అలాంటి నేను ఏఐజీ హాస్పిటల్‌లో క్యాన్సర్స్‌కు చికిత్స తీసుకున్నాను. 45 సంవత్సరాలు దాటిన తర్వాత కొలన్ క్యాన్సర్‌తో బాధపడ్డాను. స్టేజ్-4 మాత్రమే దీన్ని గుర్తించే అవకాశం ఉంది. ఏఐజీ వెళ్లి డాక్టర్ నాగేశ్వర్‌రావును కలిశాను. పరీక్షల్లో పాలిప్స్ బయటపడ్డాయి. వెంటనే చికిత్స చేసి వాటిని తొలగించారు. క్యాన్సర్‌పై అవగాహన లేకపోయి ఉన్నా.. మనకు రాదులే అని మనపై మనకు నమ్మకం, నిర్లక్ష్య భావన ఉంటే.. ఒకటి రెండు సంవత్సరాల తర్వాత నా పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదు.
అవగాహన ఉండడంతో ఆసుపత్రికి వెళ్లడంతో చికిత్స తీసుకున్నారు. ఇది చెప్పేందుకు తాను భయటపడడం లేదు’ అన్నారు. అభిమానుల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నారు. హైదరాబాద్, జిల్లాల్లోనూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల కోసం స్టార్ హాస్పిటల్‌తో మాట్లాడానన్నారు. జీనోమిక్స్ టెస్టుతో ముందస్తుగానే క్యాన్సర్‌ను గుర్తించవచ్చన్న చిరంజీవి.. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ క్యాన్సర్ నియంత్రణకు హబ్‌గా కావాలన్నారు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు