టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కరోనాపై యుద్ధంలో తాను సైతం అంటూ ముందుకొచ్చారని. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారని వార్తలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా చిరంజీవి స్పందించారు. ఆ కథనాల్లో ఉన్నది తన తల్లి కాదని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ” మీడియా అంటే నాకు చాలా గౌరవం కానీ మా అమ్మగారు మాస్క్‌లు తయారుచేస్తున్నారనే వార్తలు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం చూశాను. ఆ మీడియా కథనంలో ఉన్నది మా అమ్మగారు కాదని వినయంగా తెలియజేస్తున్నాను. కానీ ఎవరైతే ఈ కథనంలో ఉన్నారో ఆ తల్లికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే..” అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.
It is reported in press & some media channels that my mother is doing this humanitarian work. I humbly seek to clarify that it is not my mother but whichever mother is engaged in this great act of compassion I heartily thank her for such kindness.కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే pic.twitter.com/svN4RduRUg
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 11, 2020