మెగాస్టార్ చిరంజీవి నిన్న పుట్టినరోజు పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు రక్తదానం చేయడం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం తన మనసును తాకిందని పేర్కొన్నారు.
అంతేకాదు, తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా వెళ్లి వేడుకలు జరుపుకున్నానని చిరంజీవి వెల్లడించారు. కుటుంబ సభ్యులతో గడిపిన ఆ క్షణాలు అద్భుతమని వివరించారు. ఈ సందర్భంగా ఆయన కటుంబంతో కలిసి సందడి చేసిన ఫొటోలను పంచుకున్నారు. ఇందులో ఆయన భార్య సురేఖ, మెగా, అల్లు కుటుంబానికి చెందిన హీరోలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టకుంటున్నాయి.
This birthday, I have been with family away from the city and spent some wonderful time together! #BlissfulMoments #FamilyTime pic.twitter.com/cXvDhyZlEk
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2022