జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి దిగిన ఓ అరుదైన ఫొటోను షేర్ చేసి, తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. డియరెస్ట్ కల్యాణ్ బాబు అంటూ ట్వీట్‌ను ప్రారంభించారు.
జనహితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తున్నానని… ఆశీర్వదిస్తున్నానని పేర్కొన్నారు. ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు కలిగిన ఈ జన హృదయసేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీకు రాబోవు కాలం అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్‌కి సూపర్ స్టార్ మహేశ్ బాబు, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రవితేజ, శ్రీను వైట్ల, వెన్నెల కిషోర్, తమన్, యాంకర్ ప్రదీప్, సంపత్ నంది, సాయి ధరమ్ తేజ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. తనతో పాటు లక్షలాదిమందికి మార్గదర్శకుడైన తన గురువు, చిన్నమామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.