సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కుమార్తె రాగ పుష్యమి వివాహం అక్టోబర్ 29న ఆశిష్ వర్మతో ఘనంగా జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. కాగా, ఈ పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. రాగ పుష్యమి, ఆశిష్ వర్మ వివాహ వేడుకలో చిరంజీవి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన ఫొటోలను రఘు కుంచె బుధవారం విడుదల చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.