మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త చిత్రం ‘వినయ విధేయ రామ’ చిత్రీకరణ త్వరలో పూర్తికానుంది. ఇంకొక్క పాట మాత్రమే మిగిలుంది. కాగా విడుదల తేది దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనుంది. డిసెంబర్ 27న యూసఫ్ గూడలో ఈ వేడుక జరగనుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటెర్టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. స్నేహ, ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు చేస్తున్నారు.