HomeTelugu Trendingఏపీ ప్రభుత్వానికి చిరంజీవి విజ్ఞప్తి

ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి విజ్ఞప్తి

Chiranjeevi appeals to ap m
సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని మెగాస్టార్‌ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం టికెట్‌ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది.

దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్‌ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu