
Chiranjeevi to visit Pawan Kalyan Son
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సింగపూర్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్‌కు తేలికపాటి గాయాలు కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై దేశవ్యాప్తంగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదం సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్‌లోని ఒక కుకింగ్ స్కూల్‌లో జరిగింది. చిన్నారుల కోసం నిర్వహిస్తున్న క్యాంప్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడటంతో స్కూల్ భవనం రెండో, మూడో అంతస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాద సమయంలో 20 మంది విద్యార్థులు ఆ ప్రదేశంలో ఉన్నారు.
సమాచారం అందిన వెంటనే స్థానిక అగ్నిమాపక దళం తక్షణమే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసింది. గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పవన్ కుమారుడు మార్క్‌కు చేతులు, కాళ్లకు గాయాలైనట్టు చిరంజీవి వెల్లడించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
Pavan Kalyan & Chiranjeevi leaving for Singapore to visit Pavan Kalyan son Mark Shankar who was hurt in a school fire accident!#MarkShankar #PavanKalyan #Chiranjeevi #Janasena #Singapore pic.twitter.com/insCkui6Zh
— North East West South (@prawasitv) April 9, 2025
ఇక నిన్న అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్నదానికి.. చిరంజీవి, సురేఖ కూడా సింగపూర్‌కు వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించి అక్కడ ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు పవన్ కుటుంబం అక్కడే ఉండే అవకాశం ఉంది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ జగన్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మర్క్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కాగా మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ మూడో భార్య రెండో కుమారుడు. ముందుగా పవన్ కళ్యాణ్ కి అతని రెండో భార్య రేణు దేశాయితో అకిరానందన్ అనే కొడుకు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అకిరా నందన్ త్వరలోనే సినిమాలకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ మధ్య మీడియాకి కూడా అకిరా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక అకిరా మొదటి సినిమా కోసం తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు.. ఇప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ రెండో కుమారుడి వార్త కొంత నిరాశ కలిగిస్తోంది.
ALSO READ: అందుకే రాజమౌళి తో పని చెయ్యను అని చెప్పిన Chiranjeevi