మెగాస్టార్ చిరంజీవి నుంచి మూడేళ్ల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా `ఆచార్య`… సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కావడం తో మెగా ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. `ఆర్ఆర్ఆర్` తర్వాత రామ్చరణ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. .ఇవాళ విడదల అయినా ఈసినిమా థియేటర్లో రన్ అవుతుంది. సినిమాకి కాస్త మిక్స్ డ్ టాక్ వస్తుంది. చిరంజీవి రేంజ్లో సినిమా లేదనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా `ఆచార్య` ఫలితం ఇప్పుడు బెడిసికొట్టేలా ఉంది.
`ఆచార్య` ఓటీటీ రిలీజ్ డేట్ కూడా కన్ఫమ్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాని మే ఎండింగ్లోగానీ, జూన్ మొదటి వారంలోగానీ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకు ఓటీటీలో రావడానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. అదే పరాజయం చెందిన చిత్రాలను నెలలోపే స్ట్రీమింగ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మెగాస్టార్ `ఆచార్య` చిత్రాన్ని కూడా నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి… ఇందులో నిజమెంగా అనేది తెలియాల్సి ఉంది.