టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాత్రలను తెలుగులో చిరంజీవి, హిందీలో ఆమిర్ ఖాన్ పరిచయం చేయనున్నట్లు వినికిడి. కాగా ఇప్పటికే రామ్ చరణ్ టీజర్‌కు ఎన్టీఆర్ వాయిస్, ఎన్టీఆర్ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. దీంతో సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలను స్టార్ హీరోలతో పరిచయం చేయిస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నాడట రాజమౌళి. వాయిస్ ఓవర్‌కి తెలుగులో చిరంజీవి, హిందీలో అమిర్ ఖాన్ అంగీకరించారట. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎవరితో వాయిస్ ఓవర్ చెప్పించాలని ఆలోచిస్తున్నారట. ఆయా భాషల్లోని స్టార్ హీరోలతో చర్చలు జరుపుతున్నారట. ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.