కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చేస్తున్న పొరాటంలో భారతజాతి మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేసేందుకు.. ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇళ్లల్లోని విద్యుత్ లైట్లను అన్నిటినీ ఆర్పివేసి దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.
మోడీ పిలుపుపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మన ప్రియతమ ప్రధాని మోడీ పిలుపును గౌరవిద్దామని, ఆ సమయానికి అందరం దీపాలు వెలిగిద్దామని తన పోస్ట్ లో పేర్కొన్నారు. ‘కరోనా’ చీకట్లను పారద్రోలదామని, దేశం కోసం ఒకరికోసం ఒకరు నిలబడదామని పునరుద్ఘాటిద్దామని ప్రజలకు సూచించారు మెగాస్టార్.
On #5thApr20 @9 PM for 9 minutes, respecting our beloved PM’s call, let us all light lamps to drive away the darkness and gloom of #Corona Let’s stand for our country and let’s reiterate that we stand for each other! #LightForIndia#StayHomeStaySafe#Sathakotideepotsavam
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 3, 2020