టాలీవుడ్ మాస్మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. క్రాక్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లోని హోం థియేటర్ లో వీక్షించాడు. ఈ నేపధ్యంలో చిరంజీవి దర్శకుడు గోపీచంద్ మలినేనికి శుభాకాంక్షలు తెలిపారు. తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. క్రాక్ సినిమాలో ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో సాగే కథ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఒంగోలుతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. తాను ఒంగోలులో చదువుతున్న సమయంలో వేటపాలెం గ్యాంగ్, వారి ఆహారపు అలవాట్లు గురించి గగుర్పొడిచే విషయాలు వినేవాడినని చెప్పారు. రాత్రి పూట కరెంట్ కట్ చేసి..హత్యలు చేసిన విషయాలు ఆ సమయంలో ఉండేవని చెప్పుకొచ్చాడు.
తన అనుభవాలను గోపీచంద్ మలినేనితో పంచుకున్న చిరు..ఆచార్య సెట్స్ కు ఒకసారి రావాలని డైరెక్టర్ గోపీచంద్ ను ఆహ్వానించాడట. చిరు నుంచి ప్రశంసలతోపాటు ఆహ్వానం అందడంతో సంతోషంలో మునిగిపోయారు గోపీచంద్ మలినేని.