HomeTelugu Trendingజనతా కర్ఫ్యూకు చిరంజీవి పిలువు..

జనతా కర్ఫ్యూకు చిరంజీవి పిలువు..

1 19
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తుంది. ఈ వైరస్‌ విమరింత విజృంభిస్తుంది. ఇప్పటికే అనేక దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఈ మహమ్మారి మనదేశంలోనూ రోజు రోజుకు తన ప్రతాపం చూపిస్తుంది. ఇప్పటికే మన దేశంలో 258 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఐదుగురు మృత్యువాత పడ్డాడు. ఇక ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ ని పాటించాలని సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాన మంత్రి మోడీ చెప్పినట్టుగా ప్రజలందరూ జనతా కర్ఫ్యూని పాటించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని రీలీజ్‌ చేసారు. ‘ఆదివారం (22న) ఉదయం 7గంటల నుండి రాత్రి 9గంటల వరకు ప్రజలు ఇళ్ళనుండి బయటకు రావద్దని సూచించారు. అలాగే మనకోసం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు ముఖ్యంగా వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఎవరి ఇళ్లవద్ద వారు నిలబడి చప్పట్లతో వారికీ మన కృతజ్ఞతలను తెలియజేయాలని కోరారు. భారతీయులుగా మనందరం ఐక్యమత్యం తో ఒక్కటిగా నిలబడి ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొందామని , కరోనా విముక్త భారతాన్ని సాధిద్దామని మెగాస్టార్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu