ప్రపంచ దేశాలల్లో మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. వేల మంది ప్రాణాలను గాలిలో కలిపేస్తూ .. ప్రపంచాన్ని వణికిస్తోంది ఈ మహమ్మారి. కరోనా బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మనదేశంలో ఇప్పటికే 170 కేసులు నమోదు కాగా .. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ లో 13 కేసులు , ఏపీలో 2 కేసులు నమోదు అయ్యాయి. ఆ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెలబ్రెటీలు కూడా సూచిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఇప్పటికే రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి ఓ వీడియో ద్వారా జాగ్రత్తలు సూచించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు చిరంజీవి కూడా ఓ వీడియో రూపంలో ప్రజలకు అవగాహనా కల్పించారు.
A word of caution from Mega Star Chiranjeevi garu. Stay safe. #Covid19 #Covid19India pic.twitter.com/4Drg0NPvZ0
— Konidela Pro Company (@KonidelaPro) March 19, 2020