HomeTelugu Trending‘గాడ్‌ ఫాదర్‌’గా మెగాస్టార్‌

‘గాడ్‌ ఫాదర్‌’గా మెగాస్టార్‌

Chiranjeevi 153 movie title

మెగాస్టార్‌ చిరంజీవి మోహన్‌రాజా డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. రేపు (ఆగస్టు 22)న చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి శనివారం చిరు ప్రీలుక్‌తో పాటు, టైటిల్‌ను ప్రకటించింది మూవీ యూనిట్‌. ఈ సినిమాకి ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. చిరు 153వ సినిమా టైటిల్‌, ప్రీలుక్‌ మెగా ఫ్యాన్స్‌నిక ఆకట్టుకుంటుంది.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగాస్టార్‌కు 153వ చిత్రండగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు స్టార్స్‌ మెరవనున్నారు. ఇప్పటికే సత్యదేవ్‌ మంచి పాత్ర దక్కించుకున్నారు. త్వరలోనే మిగిలిన నటీనటుల వివరాలను కూడా చిత్ర బృందం వెల్లడించనుంది. మరోవైపు మెహర్‌ రమేష్‌, బాబీ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లను ఆయా చిత్ర బృందాలు ఆదివారం విడుదల చేయనున్నాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu