సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. నటుడు, దర్శకుడు రాహుల్ రవింద్రన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో బిజీ బిజీగా ఉంటున్నారు. కాగా, చిన్మయి తల్లి కానుందంటూ వస్తోన్న వార్తలపై తాజాగా ఆమె స్పందించారు. అవన్నీ పుకార్లు మాత్రమేనని అన్నారు.‘ఇటీవల మా మరిది వివాహం ఎంతో వేడుకగా జరిగింది. వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను నా భర్త రాహుల్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఆ ఫొటోల్లో నన్ను చూసి చాలామంది నేను తల్లికాబోతున్నానని అనుకున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అయితే ప్రత్యేకంగా వీడియోలు కూడా సృష్టించేశాయి. అయితే నేను చెప్పేది ఏమిటంటే.. నేను తల్లి కాబోతున్నానంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
నేను గర్భవతిని కాదు. అలాగే, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రైవేట్ విషయాలను ఇతరులతో పంచుకోవడం నాకు ఇష్టం లేదు. సోషల్‌మీడియా ఖాతాలు ఉన్నప్పటికీ వాటిల్లో ఎక్కడా నా విషయాలు చెప్పను. నిజం చెప్పాలంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో కూడా కొంతమందికి తెలీదు. భవిష్యత్తులో కూడా నా ప్రెగ్నెన్సీ, నాకు పుట్టబోయే పిల్లల గురించి చెప్తే చెప్తా. లేకపోతే లేదు. ఎందుకంటే అది మా వ్యక్తిగత విషయం. కాబట్టి ఇప్పటికైనా మీరు నాపై పుకార్లు సృష్టించడం మానేస్తే మంచిది. ఇలాంటి పుకార్ల వల్ల నేను పూర్తిగా అలసిపోయాను’ అని చిన్మయి పోస్ట్ పెట్టారు.
Wishing my babies @subiksharaman and @Rohit_Ravindran an amazing life together 😍😍❤️ pic.twitter.com/h2FLZ6Mr18
— Rahul Ravindran (@23_rahulr) July 1, 2021