HomeTelugu Newsడబ్బింగ్ యూనియన్‌పై చిన్మయి మండిపాటు!

డబ్బింగ్ యూనియన్‌పై చిన్మయి మండిపాటు!

7 25

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాదను ఇటీవల డబ్బింగ్ యూనియన్ నుంచి చిన్మయ సభ్యత్వాన్ని తొలగించింది. చిన్మయ రూ.1.5 లక్షలు చెల్లించి, క్షమాపణలు కోరితే తిరిగి సభ్యత్వం ఇస్తామని డబ్బింగ్‌ యూనియన్‌ పేర్కొంది. తాను ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, యూనియన్‌ కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా సభ్యత్వాన్ని తొలగించిందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బింగ్‌ యూనియన్‌కు అధ్యక్షత వహిస్తున్న రాధారవికి వ్యతిరేకంగా మాట్లాడిన మహిళకు తాను మద్దతు తెలిపినందుకే తనను డబ్బింగ్ యూనియన్‌ నుంచి తొలగించి, క్షమాపణలు చెప్పాలని కోరినట్లు చిన్మయి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2006 నుంచి యూనియన్కు తాను చాలా మొత్తం చెల్లించానని ఇప్పుడు మరోసారి 1.5 లక్షలు కట్టాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు.

డబ్బింగ్‌ యూనియన్‌కు, మిస్టర్‌ రాధారవికి క్షమాపణలు చెప్పాలని తనను ఎందుకు బలవంతపెడుతున్నారో అర్థం కావడం లేదని, ఆశ్చర్యంగా ఉందని డబ్బింగ్‌ యూనియన్‌ చట్టం ప్రకారం కొత్త వ్యక్తి సభ్యత్వం పొందాలంటే రూ.2,500 చెల్లించాలి కానీ వీళ్లు ఎందుకు రూ.1.5 లక్షలు చెల్లించి, క్షమాపణ చెప్పాలంటున్నారు? అని చిన్మయి వరుస ట్వీట్స్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu