ప్రపంచంలో 60 ఏళ్ల వృద్ధులు పిల్లల్ని పెళ్లాడుతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద. ప్రస్తుతం ’10 year challenge’ పేరిట ఓ ఛాలెంజ్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా సెలబ్రిటీలు, సామాన్యులు తమ పదేళ్ల క్రితం నాటి ఫొటోను ఇప్పటి ఫొటోను పక్కపక్కన పెట్టి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు సెలబ్రిటీల ఫొటోలను మీమ్స్‌లా రూపొందించి కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జొనాస్‌కు సంబంధించిన ఓ మీమ్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటోలో పదేళ్ల క్రితం ప్రియాంక ఓ చిన్నారిని ఎత్తుకున్నట్లుగా, పదేళ్ల తర్వాత పెద్దవాడైన చిన్నారిని పెళ్లిచేసుకున్నట్లుగా చూపించారు. ఈ మీమ్‌ను చిన్మయి ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ ఫొటో ఎంత అసహ్యంగా ఉందో చూశారా? ఈ దేశంలో మగవాళ్లు తమకంటే వయసులో 25 ఏళ్లు చిన్నవారైన యువతులను పెళ్లిచేసుకుంటున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లో 60 ఏళ్ల వృద్ధులు పిల్లల్ని పెళ్లిచేసుకుంటుంటే ఎవ్వరూ ఒక్కమాట అనడంలేదు. కానీ, ఓ యువతి తనకంటే వయసులో చిన్నవాడైన వ్యక్తిని పెళ్లిచేసుకుంటే అహస్యంగా ఇలా మీమ్‌లు రూపొందిస్తున్నారు. క్యాజువల్ సెక్సిజం మంచిది కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Anyone see how mean this meme is?
This is a country where men marry women 25 years their junior, elsewhere in the world 60 year olds marry children and no one bats an eyelid. A woman marries someone younger and it is a meme in a 10 year challenge.Casual sexism ain’t cool. pic.twitter.com/OrcZ83Q5T5
— Chinmayi Sripaada (@Chinmayi) January 18, 2019