HomeTelugu Big Storiesటిక్‌టాక్ బ్యాన్‌తో చైనాకు గట్టి షాక్

టిక్‌టాక్ బ్యాన్‌తో చైనాకు గట్టి షాక్

12 16
సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు చైనాకు దానికి అర్థమయ్యే భాషలోనే గట్టి సమాధానం ఇచ్చింది. టిక్ టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించింది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్ల ప్రాణాలను చైనా పొట్టనబెట్టుకుంది. గల్వాన్ ఘటన జరిగినప్పటి నుంచి డ్రాగన్ దేశంపై భారతీయుల్లో ద్వేషం తారాస్థాయికి చేరింది. దేశంలో ‘బాయ్‌కాట్ చైనా’ నినాదం బలంగా వినిపిస్తోంది. చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని దేశ ప్రజల నుంచి డిమాండ్ బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే 59 చైనా యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే పాపులర్ చైనీస్ యాప్స్ టిక్‌టాక్, హెలో, బిగో లైవ్, లైకీ, పబ్‌జీ యాప్స్ డౌన్‌లోడ్స్ ఇటీవల బాగా తగ్గాయి. టిక్ టాక్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారిసంఖ్య ఏప్రిల్‌తో పోలిస్తే మేలో 5 శాతం తగ్గింది. మేతో పోలిస్తే జూన్‌ 22 నాటికి 38 శాతం తగ్గింది. మరో పాపులర్ యాప్ హెలో డౌన్‌లోడ్స్ మే నెలలో అంతకు ముందు మాసంతో పోలిస్తే 10 శాతం తగ్గగా జూన్ 22 నాటికి 38 శాతం తగ్గాయి.

కరోనా వైరస్ విజృంభన మొదలైనప్పటి నుంచే చైనా యాప్స్ డౌన్‌లోడ్స్ తగ్గుతూ వచ్చాయి. గాల్వన్ లోయ ఘటన తర్వాత భారతీయ సెంటిమెంట్ పతాక స్థాయికి చేరింది. ఈ చైనీస్ యాప్స్‌కు ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే అతిపెద్ద మార్కెట్‌ ఉంది. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గితే భారత్‌లో మళ్లీ పుంజుకోగలమని భావించిన చైనీస్ యాప్స్ సంస్థల ఆశలపై భారత ప్రభుత్వం నీళ్లు చల్లింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu