ఈ మధ్య బాలీవుడ్ సినిమా మోజులో తెలుగు సినిమాల్లోనూ బోల్డ్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. మహా అయితే “ఇది పెద్దలకు మాత్రమే” అని A సర్టిఫికేట్ ఇస్తారు అంతకంటే చేసేదేం లేదని పచ్చి బూతుల్ని వెండి తెరపై చూపించేస్తున్నారు. తాజాగా బూతు కంటెంట్‌ను దండిగా అద్ది “చీకటి గదిలో చితక్కొట్టుడు” అనే బోల్డ్ ట్రైలర్‌ను వదిలారు. తమిళంలో “ఇరట్టు అరాయిల్ మురట్టు కుత్తు” అనే బోల్డ్ అండ్ హర్రర్ మూవీ ఇటీవల విడుదలై తమిళ జనాలను ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రాన్ని “చీకటి గదిలో చితక్కొట్టుడు” టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేశారు. ఆర్జే హేమంత్, అరుణ్ ఆదిత్ హీరోలుగా.. నిక్కీ టాంబోలి, భాగ్యశ్రీ మోటే వంటి భామలతో బోల్డ్ మూవీని రూపొందించారు.
టీజర్‌తోనే బాబోయ్ ఇదేం సినిమారా దేవుడా అనిపించిన దర్శకుడు సంతోష్ పి. జయకుమార్ ట్రైలర్‌లో తన దర్శకత్వ ప్రతిభను మొత్తం చూపించేశారు. ట్రైలర్ ఫస్ట్ ఫ్రేమ్‌లో సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేసిన దర్శకుడు ట్రైలర్ మొత్తం బూతు కంటెంట్‌తో నింపేశాడు. ఇక ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు.. ఇప్పటి వరకూ వెండితెరపై వినకూడవి.. చూడకూడవి కూడా చూపించేశారు. “నీకు ఎవర్ని చూసినా వస్తాది వైబ్రేషన్ ఫ్యాంట్‌లో.., నెల రోజులు హోల్‌లో ఏం పెట్టలేదు.. రంధ్రం మూసుకుపోయింది.., ఇంత వరకూ తినలేదు ఇప్పుడే తినాలనిపిస్తుంది పళ్లూ.., నాకూ చేతులు కట్టేసి చేస్తే చాలా ఇష్టం.., ఒరేయ్ నాకు పెద్దగా ఉంటేనా చాలా ఇష్టం” లాంటి బూతు డైలాగ్‌లు చాలానే ఉన్నాయి ఈ ట్రైలర్‌లో.
ఇక సన్నివేశాలు, అశ్లీలత లాంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బోల్డ్ సీన్లు కాన్సెప్ట్స్.. విజువలైజేషన్‌లో దర్శకుడు పీహెచ్‌డీ పట్టా పొందినట్టే ఉన్నాడు. అందుకే ఫ్యామిలీస్ ఎవరూ ఈ చిత్రాన్ని చూడకండి.. ఇది కేవలం యూత్‌కి మాత్రమే.. 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు మాత్రమే అంటూ ముందే హెచ్చరిస్తున్నారు.