వినాశపు వెంకట్ రెడ్డి తన విషపు సైట్ నుంచి ఈ రోజు కూడా మరో ఆర్టికల్ కక్కించాడు. అదేమిటంటే.. ‘కుప్పంలో ఏదో రకంగా తనను ఓడిస్తారనే భయం చంద్రబాబుకు నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతోంది అట’. కుప్పంలో వరుసగా గెలిస్తున్న చంద్రబాబుకు కుప్పం చూసి భయం అట ?, ఈ వక్రబుద్ధి గాడ్ని ఏం చేయాలి ?, నిలువునా కోసినా పాపం లేదు కదా. ఇలాంటి దిక్కుమాలిన ఆర్టికల్స్ తోనే వీడికి తన పొట్టను నింపుకోవడం అలవాటు అయిపోయింది. గతంలో కుప్పాన్ని చంద్రబాబుకు ప్రత్యర్థులు వదిలేశారట. అంటే వాళ్లంతా అమాయకులా ?, అంటే వాళ్ళల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నట్టేగా ?. అంటే.. రాజశేఖర్ రెడ్డి కంటే బటన్ మోహన్ రెడ్డి గొప్ప తెలివిగలవాడు అని అనుకోవాలా ?, అయినా బటన్ రెడ్డి స్వభావం అలాగే ఉంటుంది లేండి.
గెలిచే వరకూ.. రాజశేఖర్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. గెలిచిన కొత్తలో ఆ బొమ్మకు తన బొమ్మ కూడా తగిలించాడు. ఇక ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి బొమ్మ పీకేసి.. ఒక్క తన బొమ్మనే హైలైట్ చేసుకుంటున్నాడు. ఇది మన బటన్ మోహన్ రెడ్డి పనితనం. ఇలాంటి విషయాల్లోనే బటన్ రెడ్డికి తెలివితేటలు ఉంటాయి. ఇక మన వక్రబుద్ధి గాడి అభిప్రాయాలకు వస్తే.. ఇన్నేళ్లు కుప్పంలో ఏం జరుగుతున్నదో జనానికి తెలిసేది కాదు. ఏ జనానికి తెలియాలిరా ?, ఓట్లు వేసేది కుప్పం ప్రజలే కదరా. అయినా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో పక్క ఇంటికే తెలియడం లేదు. ఇక కుప్పంలో ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తానికి ఎలా తెలుస్తోందిరా వెంకట్ రెడ్డా ?, నీ ఒంట్లో టీడీపీ పై విషం తప్ప, విషయం లేదు అనుకుంటా ?. ఉంటే ఇలాంటివి రాయించవు.
అన్నట్టు ఇన్నాళ్లు కుప్పంలో చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది అట. ఇది కూడా వీడే రాయించాడు. నిజంగా అలా సాగితే చంద్రబాబు వరుసగా ఎలా గెలుస్తాడురా ?, ఇక ప్రస్తుతం కుప్పంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారట. మన బటన్ రెడ్డి ముందు కుప్పం మీద కాదు, పులివెందుల మీద దృష్టి సారించమను. లేకపోతే బటన్ రెడ్డి ప్యాయింట్ బటన్లు ఊడిపోయేలా జనం చిత్తు చిత్తు చేస్తారు. అసలు కుప్పంలో బాబు బలం వీడికేం తెలుసు ?, నామినేషన్ వేయడానికి కూడా చంద్రబాబు వెళ్లకపోయినా భారీ మెజారిటీతో చంద్రబాబును కుప్పం ప్రజలు గెలిపించుకున్నారు. కుప్పంలో భారీ మెజార్టీకి చంద్రబాబుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ భరోసా వుండడంతోనే చంద్రబాబు రాష్ట్రం పై దృష్టి సారించారు.
అయినా, బటన్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడే వినాశపు వెంకట్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని కారుకూతలు కూసినా అవి నిజాలు అయిపోతాయా ?, అన్నట్టు ఈ ఆర్టికల్ లో వెంకట్ రెడ్డి మరో వ్యాఖ్యం రాయించాడు. తనకు వైఎస్ జగన్ రూపంలో మొండివాడైన బలమైన ప్రత్యర్థి దొరకడంతో బాబుకు దిక్కుతోచడం లేదు అట. ఎవరికిరా దిక్కుతోచనది. దిక్కుతోచకే కదరా జీవో నెంబర్ 1 అనే బ్రిటిష్ చట్టం తీసుకొచ్చింది. దిక్కుతోచకే కదరా చంద్రబాబును ప్రజలు దగ్గరకు వెళ్లకుండా అడ్డుపడుతుంది. చివరకు నారా లోకేష్ పాదయాత్రకు కూడా భయపడుతున్న బటన్ మోహన్ రెడ్డిని చూస్తే జాలి వేస్తోంది.
అన్నట్టు.. కుప్పంలో బాబు విజయానికి, భారీ ఆధిక్యతకు కారణాలపై జగన్ అధ్యయనం చేయించారట. కర్నాటకలో స్థిరపడిన కుప్పం వాసుల ఓట్లు సుమారు 60 వేలు ఇప్పటికీ ఆంధ్రాలోనే ఉన్నాయని వైసీపీ గుర్తించింది అట. చంద్రబాబు విజయ రహస్యం దొంగ ఓట్లలో దాగి వుందని గ్రహించి, వాటిని తొలగించే ప్రక్రియకు ఆ పార్టీ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు శ్రీకారం చుట్టింది అట. మొత్తంగా ఈ బటన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అంటే.. ఆ 60 వేలు ఓట్లు అన్నీ టీడీపీ వి అయ్యి ఉంటాయి. పక్కా చంద్రబాబు అభిమానులవి అయ్యి ఉంటాయి. వారికీ కర్నాటకలో స్థిరపడిన కుప్పం వాసులు అని పేరు పెట్టి.. మొత్తానికి వాటిని తొలిగించే కార్యక్రమాన్ని బటన్ రెడ్డి తలకెత్తుకున్నాడు. చంద్రబాబు ఓడించానికి బటన్ రెడ్డి పన్నిన నీచపు పని ఇది.