వెండితెరపై 19 సంవత్సరాల ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఛార్మి కౌర్. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ వస్తోంది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ స్థాపించిన వీరిద్దరూ.. ఇప్పటి వరకూ పలు చిత్రాలను నిర్మించారు. ఆ మధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నిర్మించారు. అదేవిధంగా.. విజయ్ దేవరకొండతో పూరీ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ సినిమా కూడా వీళ్ల ఫ్యాక్టరీ నుంచే వస్తోంది. అటు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ చిత్రం కూడా వీళ్లే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విధంగా నిర్మాణ పనులు చక్కబెడుతూ.. పూరీ పక్కనే ఉంటోంది చార్మి.
తాజాగా ఛార్మి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఛార్మి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతోందట. ఈ విషయం తెలిసిన చాలా మంది నోరెళ్ల బెడుతున్నారు. ఎందుకంటే.. తాను పెళ్లి చేసుకునేది లేదంటూ.. ఇంట్రస్ట్ లేదంటూ చాలా సార్లు చెప్పింది చార్మి. అయితే.. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు చివరకు మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధమైందట. అందుతున్న సమాచారం ప్రకారం.. తమ సమీప బంధువునే పెళ్లాడనుందట ఛార్మి. అయితే ఈ పెళ్లి వార్త నిజామా లేక రూమర్ మాత్రమేన అనేది తెలియాలిసి ఉంది.