డ్రగ్స్ వివాదంలో విచారణకు ముందే హైకోర్టుకు వెళ్ళి సిట్ అధికారులకు షాక్ ఇచ్చిన ఛార్మి.. బుధవారం జరిగిన విచారణలో కూడా తీవ్ర నిరసనను మిగిల్చినట్లుగా తెలుస్తోంది. సిట్ అధికారులు ఛార్మి నుండి అనుకున్న సమాచారాన్ని రాబట్టలేకపోయారు. అధికారులు సందించిన ప్రశ్నలకు ఛార్మి లేదు, తెలియదు అంటూ సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు నా వ్యక్తిగత విషయాలు మీకేందుకు..? అని అధికారులనే ప్రశ్నించిందట. కోర్టు ఆదేశాలు ఉండడంతో అధికారులు కూడా ఆమెను గట్టిగా ప్రశ్నించలేకపోయారట. బుధవారం ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన చార్మిని ఎక్సైజ్ ఏఎస్పీ పవన్ కుమార్, మహిళా ఇన్స్పెక్టర్లతో కూడిన బృందం సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించింది. అయితే వీరు అడిగిన ప్రశ్నలకు ఛార్మి నుండి సరైన సమాధానాలు రాలేదని సమాచారం.
మీకు డ్రగ్స్ అలవాటు ఉందా..? గోవాకు ఎందుకు వెళ్ళేవారు..? బ్యాంకాక్ వెళ్తుంటారా..? అని అధికారులు ప్రశ్నిస్తే.. తనకు ఏమీ తెలియదని చెప్పిందట. కెల్విన్ ఫోన్ లో ‘ఛార్మి దాదా’ అని మీ నెంబర్ సేవ్ అయి ఉంది.. అతనితో ఏమైనా సంబంధాలున్నాయా..? అని ప్రశ్నిస్తే.. అతనెవరో తనకు తెలియదని, అతని ఫోన్ లో నా నంబర్ ఎందుకు ఉంటుందని అడిగినట్లు సమాచారం. అయితే ఛార్మి డ్రగ్స్ తీసుకున్న కొన్ని క్లిప్పింగ్స్ ను అధికారులు ఆమెకు చూపించగా వాటితో తనకు సంబంధం లేదని చెప్పిందట. ఇలా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ‘లేదు.. తెలియదు’ అనే సమాధానాలు మాత్రమే చెప్పిందని తెలుస్తోంది. మిగతా వాళ్ళతో పోలీస్త్ ఛార్మి విషయంలో కాస్త ప్రచారం ఎక్కువగా జరగడంతో.. ఆమెను ప్రశ్నిస్తే ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చని భావించిన అధికారాలకు నిరాశే ఎదురైంది. ఆమె పక్కా స్క్రిప్ట్ తో రెడీ అయి వస్తే వారు మాత్రం ఏం చేయగలరు.