తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రాన్ని రామ్ చరణ్ ‘దృవ’ పేరుతో తెలుగులో
రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో చరణ్ లిస్ట్ లో సరైన హిట్ సినిమా
పడలేదు. ఇకపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ
నేపధ్యంలో ముందుగా తన ‘దృవ’ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకున్నాడు.
సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి చిత్రబృందం ఈ విషయాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు.
అయితే ఈ సినిమా దసరాకు రిలీజ్ కావట్లేదని టాక్. దీపావళి కానుకగా విడుదల చేసే
ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ రామ్ చరణ్ వెనక్కి తగ్గితే చాలా చిత్రాలు
దసరాకు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.