సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. చరణ్ మాస్
కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు ఎక్కువగా చేస్తుంటాడు. కానీ సుకుమార్ మాత్రం అలా
కాదు.. తన కథ, కథనాల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా
అంటే ఎలాంటి జోనర్ లో ఉంటుందా..? అని ప్రేక్షకులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు
ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. సుకుమార్ ట్రేడ్ మార్క్ స్టయిల్
లో ఉండే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని,
రవి శంకర్, సీవీ మోహన్ తెలిపారు. మైత్రి మూవీస్ మేకర్స్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమా
షూటింగ్ ను నవంబర్ లో ప్రారంభించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ పని చేయనున్నారు.