గతంలో చరణ్-కొరటాల కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ తరువాత కొరటాల.. ఎన్టీఆర్ తో కలిసి ‘జనతా గ్యారేజ్’ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఆ సినిమా తరువాత చరణ్ పిలిచి మరీ కొరటాలను కథ చెప్పమని అడిగాడు. కానీ ఈసారి కొరటాల బిజీ అయిపోయాడు. మహేష్ బాబుతో సినిమా చేసిన తరువాతే చరణ్ తో సినిమా చేస్తానని చెప్పేశాడు. దీంతో చరణ్ మణిరత్నం సినిమా కమిట్ అయ్యాడు. ఇప్పుడు కొరటాల, మహేష్ తో సినిమా పూర్తి చేయాలి. అలానే చరణ్, సుకుమార్ సినిమాతో పాటు మణిరత్నం సినిమా కూడా కంప్లీట్ చేయాలి. ఆ తరువాతే చరణ్-కొరటాల కాంబినేషన్ సెట్ అయ్యేది. అప్పుడు కూడా సినిమా ఉంటుందో.. ఉండదో తెలియని పరిస్థితి. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా.. జరగొచ్చు!