రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమా
పూజా కార్యక్రమాలను ఈ నెల 12 న హైదరాబాద్ లో జరిపి, ఆరోజు నుండే షూటింగ్ లాంఛనంగా
ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించే సుకుమార్, చరణ్
తో ఓ సైంటిఫిక్ చిత్రాన్ని రూపొందించనున్నారనే మాటలు వినిపించాయి. అయితే సుకుమార్
ఇది అలాంటి సినిమా కాదని, పూర్తిగా గ్రామీణ నేపధ్యంలో సాగే కథ అని చెప్పారు. ఆమధ్య
కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రాన్ని పక్కన పెడితే, మామూలుగా
చరణ్ చేసే సినిమాలన్నీ సిటీ బ్యాక్ డ్రాప్ లోనే కనిపిస్తాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ
కథ కచ్చితంగా చరణ్ కు కొత్తగా ఉంటుందని భావిస్తున్నారు.