HomeTelugu TrendingLucky Baskhar Release Date: ఎన్టీఆర్ కోసం సైడ్ ఇచ్చిన స్టార్ హీరో

Lucky Baskhar Release Date: ఎన్టీఆర్ కోసం సైడ్ ఇచ్చిన స్టార్ హీరో

New changes in Lucky Baskhar release date
New changes in Lucky Baskhar release date

Lucky Baskhar Release Date:

వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భం గా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర హీరో దుల్కర్ సల్మాన్ తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలియజేశారు.

 

దుల్కర్ సినిమా నుండి తన పోస్టర్ ను షేర్ చేస్తూ, “ఈ వినాయక చవితి ని గ్రాండ్ గా జరుపుకోండి. సెప్టెంబర్ 7న థియేటర్స్ లో #లక్కీభాస్కర్ ని చూస్తూ ఆనందించండి! ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళం మరియు హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది” అని పోస్ట్ చేశారు.

 

అసలు ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉండగా, ఎన్టీఆర్ దేవర సినిమాతో క్లాష్ వద్దు అనుకుని లక్కీ భాస్కర్ సినిమాని ప్రీ పొన్ చేసి ముందుగా సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నారు. దుల్కర్ కి మలయాళంలో ఉన్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ తెలుగులో లేదు. పైగా ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ ఇంకా ఎక్కువ కావడంతో చిత్ర బృందం కూడా క్లాష్ రాకుండా చూడడానికి మొగ్గు చూపింది.

 

సినిమా కథ విషయానికి వస్తే మగధా బ్యాంక్ అనే ఫేక్ సంస్థలో పని చేసే భాస్కర్ ప్రతిరోజూ అదే పని చేస్తూ విసుగెత్తిపోతాడు. కానీ సడన్ గా భాస్కర్ కి బోలెడు డబ్బు వస్తుంది. ఉన్నట్టుండి భాస్కర్ ఎక్కడి నుంచి అంత డబ్బు సంపాదించాడో అని అందరూ ఆశ్చర్యపోతారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్. 1980, 1990 బ్యాక్ డ్రాప్ లో సినిమా కథ నడుస్తుంది.

 

సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకార స్టూడియోస్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. లక్కీ భాస్కర్ తెలుగు, తమిళ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu