HomeTelugu Trendingచంద్రముఖి-2 రిలీజ్‌ ట్రైలర్‌

చంద్రముఖి-2 రిలీజ్‌ ట్రైలర్‌

Chandramukhi 2 Release Trai

చంద్రముఖి-2 సెప్టెంబర్‌ 28 విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఎలాంటి అంచనాల్లేవు. తాజాగా రిలీజ్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌ సినిమాపై కాస్త అంచనాలను పెంచేలా ఉంది. ఒక పెద్ద బంగ్లా.. ఆ బంగ్లాలో పగతో రగిలిపోతున్న ఆత్మ.. ఆ అత్మను పంపించడానికి హీరో చేసే సహాసాలు. అన్ని హార్రర్ కథలలానే ఇది కూడా ఉండబోతుందని ట్రైలర్‌లతో క్లారిటీ వచ్చేసింది.

అయితే యాక్షన్‌ కూడా పుష్కలంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా రన్‌ టైమ్‌ 2 గంటల 50 నిమిషాలట. ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌లో ప్రేక్షకుడ్ని థియేటర్‌లో కూర్చోబెట్టడం అంటే కత్తి మీద సామే అని చెప్పాలి. చంద్రముఖి ఒరిజనల్ వెర్షన్‌ 2గంటల 46 నిమిషాలు. ఇక ఇప్పుడు 4 నిమిషాలు అదనంగా ఈ సినిమా నిడివి ఉండనుంది.

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, రాఘవా లారెన్స్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!