రాఘవ లారెన్స్ హీరోగా నటించిన తాజా చిత్రం చంద్రముఖి-2. పి.వాసు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కథ, కథనం, టేకింగ్ ఏది కూడా కొత్తగా లేకపోవడం.. పై పెచ్చు గ్రాఫిక్స్ దరిద్రంగా ఉండటంతో జనాలు చంద్రముఖి-2 సినిమాను తిప్పి కొట్టారు.
అసలు లారెన్స్ ఈ కథను ఎలా ఒప్పుకున్నాడో అతనికే తెలియాలంటూ ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు. అయితే పోటీగా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో కొంత వరకు ప్రొడ్యూసర్లకు ఈ సినిమా నష్టాలు మిగిల్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 26 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులను రిలీజ్‌కు ముందే కొనుక్కోవడంతో నిర్మాతలకు కాస్త కలిసొచ్చింది. చంద్రముఖి సినిమాకున్న క్రేజ్‌తో సీక్వెల్ కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు డిజిటల్ హక్కులను దక్కించుకుంది. కంగనా రనౌత్ కీలకపాత్ర పోషించిన ఈ సినిమాకు ఆస్కార్ గ్రహిత ఎమ్.ఎమ్ కీరవాణి స్వరాలు కూర్చాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ సుభాస్కరణ్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.