Homeపొలిటికల్Chandrababu Naidu: జగన్‌.. ప్రజల జీవితాలతో ఆడుకొనే ఓ జలగ

Chandrababu Naidu: జగన్‌.. ప్రజల జీవితాలతో ఆడుకొనే ఓ జలగ

Chandrababu NaiduChandrababu Naidu: ఈ రోజు సాయంత్రం నరసాపురంలో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ఐదేళ్ల పాలన తీరుపై నిప్పులు చెరిగారు. ”గత ఎన్నికల్లో బాబాయిని చంపి ఓట్లు అడిగారు. వైసీపీకు జగన్‌ గొడ్డలి గుర్తు పెట్టుకోవాలి. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది. రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్లు అప్పుల కుప్ప చేశారు.

ప్రజల నెత్తిన అప్పుల కుంపటి ఉంది. వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉంది. తండ్రి లేని బిడ్డ అని గతంలో జగన్‌ సానుభూతి పొందారు. కిరాణా దుకాణాల్లోనూ గంజాయి దొరుకుతోంది. జే బ్రాండ్‌ మద్యం, గంజాయి, డ్రగ్స్‌ తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. జగన్‌.. ప్రజల జీవితాలతో ఆడుకొనే ఓ జలగ అన్నారు. దీన్ని అమ్మేదీ వైసీపీ నేతలే. జగన్‌ పాలనలో అన్ని రంగాలు పతనావస్థకు చేరాయి. గ్రీన్‌ ట్యాక్స్‌ వల్ల ఆటో మొబైల్‌ రంగం దివాళా తీసింది. రాష్ట్రంలో బాగుపడింది జగన్‌ ఒక్కడే” అన్నారు.

కూటమిగా పోటీ చేస్తోన్న మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటే. రాష్ట్రాన్ని బాగు చేయడమే కూటమి అజెండా. ప్రజల జీవితాల్లో వెలుగు తేవడమే మా అజెండా. టీడీపీ హయాంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తయారుచేశాం. కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్‌ అమలుచేశాం. దేశంలో ఆక్వా రంగాన్ని నంబర్‌ వన్‌గా నిలిపాం. ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. రైతులకు రూ.20వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. అన్నదాతను ఆదుకొంటాం.. రైతును రాజుని చేస్తాం. వైకాపా విముక్త రాష్ట్రంగా చేయాలనేది పవన్‌ ఆకాంక్ష.

మోడీ సారథ్యంలోనే భారత్‌ నంబర్‌వన్‌గా తయారవుతుంది. భారత్‌ను అగ్రగామిగా మార్చేందుకు మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారు. 2047 నాటికి భారత్‌ నంబర్‌వన్‌గా తయారవుతుంది. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే. రాష్ట్రంలో 160 అసెంబ్లీ 24 పార్లమెంటు స్థానాలు గెలవాలి. సంపద సృష్టించి ఆదాయం పెంచి పేదలకు పంచుతాం. పిల్లలను బాగా చదివిస్తేనే ప్రపంచాన్ని జయిస్తారు. తెదేపా వచ్చాక ఆడబిడ్డలకు 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాం.

‘మీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌ రాజు.. మహాముదురు. మామూలు ముదురు కాదు. సర్వం దోచేసిన మహాముదురు. ఏటిగట్టు పనులు నాసిరకం చేశాడా, లేదా? కొట్టుకొనిపోయాయా, లేదా? మెడికల్‌ కాలేజీ వస్తుందని నమ్మించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. కాలేజీ వచ్చిందా? అక్రమ ఇసుక రవాణాతో కనీసం ఒక రూ.30 కోట్లు కొట్టేశాడు.. మహాముదురు. లే అవుట్‌ వేయాలంటే ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. జగన్‌మోహన్‌ రెడ్డీ.. నువ్విచ్చిన చనువు.. నువ్వు నేర్పిన విద్య. ఈ ప్రభుత్వంలో ఇష్టానుసారం ప్రజల ఆస్తులను మేసిన ప్రతీ వ్యక్తినుంచి కక్కించే బాధ్యత మాది” అని నరసాపురం ప్రజలతో చంద్రబాబు అన్నారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతి, నిజాయతీతో పార్టీ జెండా మోసినవాళ్లు చాలామంది ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చినా జెండాలు మోసిన మా కార్యకర్తల్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. మీ త్యాగం వృథా కాదు. నేను అండగా ఉంటాను. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు మనవే వస్తాయి. అందరికీ తగిన గుర్తింపు ఉంటుంది. న్యాయం చేసే బాధ్యత మాది” అని పార్టీశ్రేణుల్లో భరోసా నింపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu