Homeతెలుగు Newsకొత్త మంత్రికి ఇవ్వాలా? సీనియర్ మంత్రికా?

కొత్త మంత్రికి ఇవ్వాలా? సీనియర్ మంత్రికా?

3 9ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరి కాసేపట్లో సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఎస్టీ, మైనారిటీ నాయకులతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, మండలి ఛైర్మన్ స్థానం భర్తీ, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఫరూక్‌, శ్రావణ్‌లను మంత్రివర్గంలోకి తీసుకుంటున్న విషయాన్ని వారికి వెల్లడించనున్నారు. మంత్రిపదవి ఆశించిన నేతలను సీఎం బుజ్జగించనున్నారు. శాఖల మార్పులు-చేర్పుల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కీలకమైన వైద్యారోగ్య శాఖ బాధ్యతలు కొత్త మంత్రికి ఇవ్వాలా? లేక సీనియర్ మంత్రికా? అనే అంశంపై తర్జన భర్జన జరగుతోంది. మండలి ఛైర్మన్ స్థానానికి పరిశీలనలో షరీఫ్, రెడ్డి సుబ్రమణ్యం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే చాంద్ భాషాతోనూ ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. మంత్రి వర్గ విస్తరణ కోసం విజయవాడకు రానున్న గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రేపు ప్రజావేదికలో మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ హైదరబాద్‌కు చంద్రబాబు తిరుగు పయనమవనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu