HomeTelugu Newsతెలుగు గడ్డపై జన్మించడం నా అదృష్టం: చంద్రబాబు

తెలుగు గడ్డపై జన్మించడం నా అదృష్టం: చంద్రబాబు

9 19ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం ఎన్నో జన్మల పుణ్యఫలం అని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ తన శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి తన కార్యసాధనకు మరింత ప్రేరేపించాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ ట్వీట్లు చేశారు.ధర్మ పోరాట దీక్ష ఆరంభించి నేటికి సంవత్సరం అయిందని, 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డానని చెప్పారు. అప్పుడప్పుడూ కొంత ఆలస్యం అయినా అంతిమంగా ధర్మానిదే విజయం అని అనుభవంలో నేర్చుకున్నానని పేర్కొన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నమ్మకం తనకుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు 69వ జన్మదిన వేడుకలు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేదపండితులు చంద్రబాబుకు మంగళాశీర్వచనాలు పలికారు. గుంటూరు రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట పట్టణంలోని సీబీఎన్‌ ఆర్మీ, టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కేక్‌ కట్‌ చేసి శ్రేణులకు పంచారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu