Homeపొలిటికల్AP Elections 2024: మన భూములపై జగన్‌ పెత్తనం.. అరాచకమంటున్న చంద్రబాబు!

AP Elections 2024: మన భూములపై జగన్‌ పెత్తనం.. అరాచకమంటున్న చంద్రబాబు!

AP Elections 2024AP Elections 2024: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా పొదిలి చిన్న బజారు కూడలిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో 1.5లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో ఉద్యోగి 40 మందికి పింఛను ఇచ్చినా ఇంటింటికే వెళ్లి ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ, అలా చేయకుండా సచివాలయానికి రమ్మని చెప్పి, అక్కడ కూడా ఇవ్వకుండా పండుటాకుల్లాంటి ముసలివాళ్లను బ్యాంకుల చుట్టూ తిప్పుతూ నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటి దగ్గర ఇవ్వకుండా, వృద్ధులను సచివాలయాలకు తిప్పి, అక్కడా ఇవ్వకుండా పండుటాకుల వంటి ముసలి వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దుర్మార్గం ఇది, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఈ నెల పెన్షన్లపైనా తాము పోరాడామని, సిబ్బంది ద్వారా ఇప్పించాలని చెప్పామని, కానీ ఈ దుర్మార్గుడు ఇంటివద్ద ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో వేశాడు. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేయడం ముసలివాళ్లకు తెలుసా? అని ఆగ్రహం వెలిబుచ్చారు. తాము అధికారంలోకి వస్తూనే ఏప్రిల్ నెల నుంచి వర్తించేలా రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కానీ జగన్ 2028 నాటికి రూ.250 పెంచుతాడంట అని వెల్లడించారు.

“ఐఏఎస్ చదువుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడుగుతున్నా… ముసలివాళ్లు ఐదు కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లగలరా? బ్యాంకుకు వెళితే ఆధార్ కార్డు కావాలి, పాన్ నెంబరు కావాలి… పాపం ఆ ముసలివాళ్లు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతెలియకుండా అవస్థ పడుతున్నారు. ఇప్పుడు చెబుతున్నా మీ
కుటుంబానికి పెద్ద కొడుకుగా నేనుంటా. రూ.4 వేల పెన్షన్ ఇస్తా.. 1వ తేదీనే మీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది. ప్రభుత్వాన్ని, సీఎస్ ను హెచ్చరిస్తున్నా… ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వృద్ధులు పడే క్షోభ నేను చూశాను… వారి ఉసురు మీకు తగులుతుంది” అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

”40ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న మాగుంట కుటుంబాన్ని కాదని, తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌ను తీసుకొచ్చారు. ఒంగోలు ప్రాంతానికి నాయకుడు కావాలా? స్మగ్లర్‌ కావాలా? నల్లమల ఫారెస్ట్‌లో ఎర్రచందనం మొత్తం మాయమయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి. జగన్‌కు మంచి చేయడం తెలియదు కానీ, మాఫియాలు నడపడంలో మాత్రం దిట్ట. ఇసుక, మద్యం, గనుల మాఫియా డబ్బంతా జగన్‌కే వెళ్తోంది. ఉద్యోగులపై 1500 కేసులు పెట్టి వేధించిన సైకో ఈ ముఖ్యమంత్రి. 2014 తండ్రిలేని బిడ్డనని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. 2019లో చిన్నాన్నను చంపేశారని సానుభూతి నాటకమాడి ఓట్లు కొట్టేశాడు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. నాటకాల జగన్‌ రాష్ట్రానికి అవసరమా?

భూమి మనది.. చుట్టూ ఉన్న హద్దు రాళ్లు, పట్టాదార్‌ పాస్‌బుక్‌పై ఫొటో జగన్‌ది. ఒక మనిషి అరాచకానికి పరాకాష్ట ఇది. రేపట్నుంచి మీ భూమికి ఒరిజినల్‌ దస్తావేజులు, పాస్‌ బుక్‌, అడంగల్‌ ఉండవు.. అన్నీ ఆన్‌లైన్‌లోనే. ఇదంతా జగన్‌ మాయ. మీ ఆస్తి ఇతరులకు రాయొచ్చు, తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు. జవాబుదారీ తనం ఉండదు. మీరు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకునే వారే ఉండరు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు వల్ల ఉపయోగం లేదు. ఈ చట్టం రైతు మెడకు ఉరితాడుగా మారుతుంది. కూటమి అధికారంలో రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu