Homeతెలుగు Newsధర్మ పోరాటంతో ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం: చంద్రబాబు

ధర్మ పోరాటంతో ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం: చంద్రబాబు

రాష్ట్రం విడిపోయే సమయానికి రాయలసీమలో కరువులో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 20 ఏళ్ల డేటా తీసుకుంటే అనంతపురంలో 16, 17 సార్లు తక్కువ వర్షపాతం నమోదు కావడం, కరువు జిల్లాగా మిగిలిపోవడం, ఓ స్టేజ్‌లో అయితే ఎడారిగా మిగిలిపోతుందేమో అని భయపడే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. రాయలసీమ
పూర్తిగా రాళ్ల సీమగా మారిపోతుందని ప్రజలు ఆందోళన చెందారని అన్నారు. మరోవైపు కోస్తాంధ్రలో తీవ్రమైన తుఫాన్లతో నష్టం జరిగిందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక 3 నెలల్లోనే హుధుద్ తుఫాన్ విశాఖపట్నాన్ని అతలాకుతలం చేయడం ఈ రెండింటినీ సవాలుగా తీసుకున్నామని చంద్రబాబు అన్నారు.

7 4

ఈ ఏడాది సాధారణం కంటే 60 శాతం వర్షపాతం ఒక్కకడపలోనే తక్కువగా ఉందని చంద్రబాబు తెలిపారు. మరోవైపు అనంత, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సగటున 50 శాతం పైగా వర్షపాతం తక్కువ ఉందని, దీనికి కర్నూలు, నెల్లూరు కూడా కలిశాయని అన్నారు. ఇప్పటికే చాలా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని అన్నారు. ఓ
పక్క కరువును ఎదుర్కొంటూనే మరోవైపు కరువు రహిత రాష్ట్రంగా చేసేందుకు నాలుగేళ్ల క్రితం పద్ధతి ప్రకారం పనులు ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు.

ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేయాలనే లక్ష్యంగా ఓ పద్ధతి ప్రకారం వీటిని ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించామని అన్నారు. లక్ష చెక్ డ్యాంలు నిర్మించామని తెలిపారు. అన్ని చెరువులకు అనుసంధానం చేస్తూ గొలుసుకట్టు చెరువులను ఏర్పాటు చేశామని అన్నారు.

7a

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువ పనులు చేశామని చంద్రబాబు అన్నారు. నిరుద్యోగ భృతి, నైపుణ్య అభివృద్ధికి కూడా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చామని చంద్రబాబు తెలిపారు. 1500 పూర్తి చేసుకున్న సందర్భంలో ఏం చేశాము, ఎంత చేశామనేది ధైర్యంగా ప్రజలకు వివరించాలని నాయకులకు చంద్రబాబు సూచించారు. నియోజకవర్గానికో పార్క్‌ను కూడా తయారు చేశాం. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

కేంద్రం ఇవ్వాల్సిన విద్యాసంస్థలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. ఇందులో మన ఎంపీలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. మొన్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై గట్టిగా ఫైట్ చేశారని అన్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అని అన్నారు. అంతకు ముందు మనం బీజేపీతో ఎన్డీయేలో ఉన్నాం,
సరిగా చేయలేదని మాట్లాడే వ్యక్తులు కూడా టీడీపీ బ్రహ్మాండంగా పోరాడింది అనే పేరు మన ఎంపీలు తీసుకొచ్చారని తెలిపారు. ఇందులో ఈరోజు పార్లమెంటులో ఉంటే పోరాడాల్సి వస్తుందని రాజీనామా చేసి పారిపోయిన పార్టీ వైసీపీ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీకి ధైర్యం ఉంటే ఎందుకు నిలబడలేదు, ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. మిమ్మల్ని ఎంపీలుగా గెలిపించింది రాష్ట్ర హక్కుల కోసం పోరాడటానికేనని, మీనమేషాలు లెక్కేసి లాలూచీ రాజకీయాలు చేయడానికి కాదని మండిపడ్డారు. మరోవైపు అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకని చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీకి రానివాళ్లు జీతం ఎందుకు తీసుకోవాలని, అసెంబ్లీకి రావడం, ప్రజా సమస్యలపై పోరాడటం ఎమ్మెల్యే బాధ్యత అని, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ధర్మపోరాటం ఆపే పరిస్థితి లేదు, ధర్మ పోరాటం వల్ల ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇంకా సమాయత్తం చేస్తున్నాం. రెండు రోజుల క్రితం ప్రత్యేక హోదా కోసం ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి వారికి విజ్ఞప్తి చేస్తున్నానని ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడొద్దని, ధైర్యంగా ఉండండి,
పోరాడి హక్కులు సాధిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. రైల్వేజోన్, లోటు బడ్జెట్, కడపలో స్టీల్ ప్లాంట్, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, పోలవరం నిర్మాణం ఇలాంటి 18 డిమాండ్లపై కక్షగట్టినట్టు పనిచేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాగుందంటే ఆయనకు సహకరించేందుకు ఆఘమేఘాల మీద 4 రోజుల్లోనే బిల్లులన్నీ
పాస్ చేసే పరిస్థితి అని చంద్రబాబు విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు అవసరమైతే చట్టాల్లో మార్పులు చేసుకుని కావాల్సిన వారికి పనులు చేస్తున్నారని, మన రాష్ట్రంపై మాత్రం చిన్న చూపు చూస్తుందని, వివక్షకు గురిచేస్తోందని, అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. కానీ వాళ్ల అంచనాలకు దొరకని విధంగా మనం పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

7b

నాకు ఎవరిపైనా కోపం లేదని, ప్రజలకు న్యాయం జరగాలన్నదే నా కమిట్ మెంట్, రాష్ట్రాన్ని మోడల్‌గా, ఆదర్శవంతంగా తయారు చేయాలని చంద్రబాబు తెలిపారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకూడదని, వాళ్ల నమ్మకాన్ని కాపాడుకునేందుకు అనునిత్యం పనిచేయాలని నాయకులకు సూచించారు.
జెండాలు మోసిన కార్యకర్తల మనోభావాలను గుర్తుపెట్టుకోవాలని, అందరం కలిసి ప్రజాసేవలో పాల్గొనాలని తెలిపారు. మన కార్యకర్తలు తప్పు చేసినా ప్రజలు మనతో ఉండరన్న విషయం గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. కార్యకర్తలు కష్టాల్లో ఉంటే పార్టీ పరంగా ఆదుకోవాలని సూచించారు.

దేశంలో ఇంత అవినీతి చేసిన పార్టీ వైసీపీ కంటే మరోటి లేదని చంద్రబాబు తెలిపారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి బోనులో నిల్చొని ఎలా వాయిదా తెచ్చుకోవాలో తెచ్చుకుని బయటకు వచ్చి మమ్మల్ని విమర్శించే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వాళ్లు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు కాబట్టి, మనపై బురద చల్లితే ప్రజల్లో మనపై అపనమ్మకం వస్తుందనే ఉద్దేశంతో మనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అవినీతికి టెక్నాలజీతో చెక్ పెట్టిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు తెలిపారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా టెక్నాలజీతో చెక్ పెట్టామని అన్నారు. రాబోయే రోజుల్లో వర్క్స్ డిపార్ట్‌మెంట్లో కూడా ఎక్కడికక్కడ చెక్ పెట్టే పరిస్థితి వస్తుందని, రెగ్యులేటరీ డిపార్ట్‌మెంట్లో కూడా టెక్నాలజీ పెట్టింన తరువాత ఎవరూ అవినీతి చేయడానికి వీల్లేదని, ఏ ఆఫీసుకూ వెళ్లకపోతే డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని చంద్రబాబు తెలిపారు. అలాంటి స్టేజ్‌కు త్వరలో రీచ్ అయ్యే పరిస్థితి వస్తుందని చంద్రబాబు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu