HomeTelugu Big Storiesశాతకర్ణి ఆడియోకి స్పెషల్ గెస్ట్స్!

శాతకర్ణి ఆడియోకి స్పెషల్ గెస్ట్స్!

నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమి పుత్రశాతకర్ణి’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.  సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది. దాదాపు సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది.

వచ్చే నెల 9న సినిమా ట్రైలర్ విడుదల చేసి.. ఆ తరువాత సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీప్రముఖులతో పాటు ఇద్దరు వ్యక్తులు ముఖ్య అతిథులుగా రానున్నారు.

ఈ వేడుకను తిరుపతిలో నిర్వహించాలనేది చిత్రబృందం ప్లాన్. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరిని ఆహ్వానించడానికి బాలయ్య ప్రయత్నిస్తున్నారు. బాలయ్య సినిమా కాబట్టి
కచ్చితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరవ్వడం ఖాయం. మరి ఈ కార్యక్రమానికి ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుంటుందో.. చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu