Homeతెలుగు Newsస్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో చంద్రబాబు

స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో చంద్రబాబు

విజయవాడలోని అంబేద్కర్‌ కాలనీ 19వ వార్డులో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. శిఖామణి సెంటర్‌ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్‌ కాలనీలో రహదారులను చీపురుతో ఊడ్చిన సీఎం.. స్థానికులతో కలిసి సెల్ఫీలు దిగారు.

10a

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని, ముఖ్యమంత్రులు వీధులను ఊడ్చే కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇల్లు శుభ్రంగా ఊడ్చి.. ఆ చెత్తను బయట పారబోస్తే సంస్కారం అనిపించుకోదన్నారు. జపాన్‌, సింగపూర్‌ దేశాల్లో ప్రజలెవరూ చెత్తను రోడ్లపై పారబోయరని.. భారతీయులు తమ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో స్థానికుల భాగస్వామ్యం కావాలన్నారు. గతంలో విజయవాడకు కాస్త చెడ్డపేరు ఉండేదని.. అది క్రమంగా మారుతోందన్నారు. గాంధీజీ అనుసరించిన విధానాలను అమలు చేస్తూ విజయవాడ నగరాన్ని దేశంలోనే అందమైన నగరంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రత్యేకంగా రూ.75 కోట్లు బడ్జెట్లో పెట్టి విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్‌ను ‌ఆదుకున్నామని… ప్రభుత్వ చర్యల వల్ల స్వచ్ఛ్‌ సర్వేక్షన్‌లో ఉత్తమ అవార్డులను విజయవాడ కైవసం చేసుకుందని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణ ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నామని… అందుకే జాతీయస్థాయిలో మన నగరాలు అవార్డులు అందుకుంటున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

10

Recent Articles English

Gallery

Recent Articles Telugu