HomeTelugu Newsనాకు దేవాన్ష్‌ ఒక్కడే కాదు.. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవళ్లే

నాకు దేవాన్ష్‌ ఒక్కడే కాదు.. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవళ్లే

9 6‘మీ పిల్లల్ని బడికి పంపించండి. వారిని ఇంజినీర్లు, డాక్టర్లను చేసే బాధ్యత నాది. వారి చదువుకు ఏడాదికి రూ.18వేలు ఇస్తా. నాకు దేవాన్ష్‌ ఒక్కడే కాదు. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవలు, మనవరాళ్లే’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌ కూడా ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. టీడీపీ జెండాతో దేవాన్ష్‌ వేదికపై సందడి చేశాడు. తాను రోజూ బయటకు వెళుతుంటే.. ఎక్కడికి అని దేవాన్ష్‌ అడిగేవాడని, తన కష్టం తెలియాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి తీసుకొచ్చానని చంద్రబాబు చెప్పారు.

‘వృద్ధులకు, పేదలకు అండగా ఉంటానని హామీ ఇచ్చా. పింఛన్లు ఐదు రెట్లు పెంచా. త్వరలో పింఛను రూ.3వేలు చేస్తా. పోలవరం పూర్తయితే కృష్ణా జిల్లాకు నీటి కొరత ఉండదు. రాజధాని వల్ల కృష్ణా జిల్లాలో భూముల విలువ పెరిగింది. రాష్ట్రంలో ఉన్న చిన్నారుల భవిష్యత్‌ నాది. విదేశాల్లో విద్యనభ్యసించే వారికి రూ.20లక్షలు ఇస్తా. ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు ఇస్తా. ఇలాంటి ఆలోచనలు కోడికత్తి పార్టీకి రావు. ఎవరైనా బీకాం చేసి.. ఎంబీఏ చేస్తారు. కానీ జగన్‌ గతంలో ఎంబీఏ చదివానని చెప్పాడు. ఇప్పుడు బీకాం అంటున్నాడు. నరేంద్రమోడీ అయితే ఏ యూనివర్సిటీలో చదివారో తెలీదు. నేను మాత్రం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ, పీహెచ్‌డీ చేశా’ అని చంద్రబాబు అన్నారు.

‘హైదరాబాద్‌ వంటివి ఆంధ్రాలో 20 చేస్తా. అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాద్‌ వెనుకబడుతుందని కేసీఆర్‌ భయపడుతున్నారు. అమరావతిని అణగదొక్కాలని కేసీఆర్‌ చూస్తున్నారు. జగన్‌, కేసీఆర్‌, మోడీ కలిసి కుట్రలు పన్నుతున్నారు. వైసీపీ నేతలు డబ్బులు వెదజల్లుతున్నారు. డబ్బుతో ఓటర్లను కొనాలని చూస్తున్నారు. వారి కుట్రలను తిప్పి కొట్టాలి. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలి’ అని చంద్రబాబు ఓటర్లను కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu