టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి… చంద్రబాబును మొదట వైసీపీ నేతలు అడ్డుకున్నారు.. అనంతరం పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది… ఇక, కాన్వాయ్‌లోని చంద్రబాబు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అనంతరం.. ఆయనను అంబులెన్స్ దగ్గరకు టీడీపీ నేతలు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా… పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. తిరిగి వెళ్లాలంటూ పోలీసులు చంద్రబాబును కోరవడంతో చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆయన తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో రాసివ్వాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ ఉన్నా అడ్డుకుంటారా అంటూ ఫైర్ అయిన చంద్రబాబు… నన్ను షూట్ చేయండి… నన్ను ఎన్ కౌంటర్ చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.