HomeTelugu Newsజగన్‌ తన చెట్టును తానే నరుక్కుంటున్నారు: చంద్రబాబు

జగన్‌ తన చెట్టును తానే నరుక్కుంటున్నారు: చంద్రబాబు

9 14ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తన చెట్టును తానే నరుక్కుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణ కావాలని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగితే, అవసరం లేదన్నట్లు ఓ కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. అసెంబ్లీ లాబీల్లో చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పోలవరానికి ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ రాకపోవడంతోపాటు ఆర్‌అండ్‌ఆర్‌ రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం అంటోదని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం..వైసీపీ మాట్లాడటం లేదని మండిపడ్డారు. పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికే ఉపయోగపడట్లేదని అంటున్నారని, గోదావరికే కృష్ణా నీళ్లు తీసుకెళ్లినట్లు వైసీపీ మాట్లాడుతోందని చంద్రబాబు ఆక్షేపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu