మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాశీస్సులు. పట్టుదలతో పైకెదిగిన మీ సినీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. మీ సేవాకార్యక్రమాలతో సమాజంలో ఒక ఒరవడి తెచ్చారు. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు.
పద్మభూషణ్ @KChiruTweets గారికి హృదయపూర్వక జన్మదిన శుభాశీస్సులు. పట్టుదలతో పైకెదిగిన మీ సినీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. మీ సేవాకార్యక్రమాలతో సమాజంలో ఒక ఒరవడి తెచ్చారు. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. pic.twitter.com/fmuYS5mqwJ
— N Chandrababu Naidu (@ncbn) August 22, 2021