టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ గత రెండుమూడు రోజులుగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించారు. అవన్నీ అసత్య వార్తలేనని ఆయన కొట్టి పారేశారు. ఐదు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈనెల 23 ఆయన జన్మదినం. ఆ సందర్భంగా ఓఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సన్నిహితులు చెప్తున్నా వినిపించుకోకుండా తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని.. అందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాను సినిమాలలో నటించనంటూ ఆయన ప్రకటించారు దీంతో చంద్రమోహన్‌కు ఆరోగ్యం బాగాలేదని.. పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై చంద్రమోహన్ తాజాగా స్పందించారు. ఈమేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. నాకు బాగోలేదని వచ్చే వార్తల్లో నిజం లేదు. వాటిని నమ్మకండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మీ అందరి అభిమానం, ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష’ అని ఆ వీడియోలో చంద్రమోహన్ తెలిపారు.