చాందిని చౌదరి కెరీర్ తో ఆడుకొన్న బడా నిర్మాత!
ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో మంచికంటే చెడు ఎక్కువగా ఉంటుందని తెలిసి కూడా చాలా మంది రెక్కలు కట్టుకొని ఇక్కడ వాలిపోతుంటారు. అలా వచ్చినవారిలో కేవలం 10% జనాలు మాత్రమే విజయతీరామ్ చేరతారు, మిగిలిన అదృష్టం బాగుంటే తిరిగి ఇంటికి వెళతారు, లేదంటే ఈ లంపటంలోనే ఇరుక్కుపోయి తమ జీవితాలను నాశనం చేసుకొంటుంటారు. ఈ లంపటంలో దాదాపుగా చిక్కుకుపోయి చివరి నిమిషంలో బయటపడింది యువ కథానాయకి చాందిని చౌదరి. ఈ అమ్మడు 2012లోనే తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా.. ఓ బడా నిర్మాత ఆమెతో రెండేళ్ళ ఎగ్రిమెంట్ చేసుకొని తన సినిమాలో నటించనివ్వక, వేరే సినిమా చేసుకోనివ్వక నానా ఇబ్బంది పెట్టాడట.
అందువల్ల చాందిని కెరీర్ రెండేళ్లపాటు దిక్కుతోచక ఊగిసలాడిందట.
అదృష్టం బాగుండి.. ఇప్పుడు హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకొంటూ దూసుకుపోతోంది!