‘జబర్దస్త్’ కామెడీ షోలో కొంతకాలంగా సుధీర్ కనిపించడం లేదు. దాంతో ఆయనను తీసేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు గల కారణం ఏమిటనే ప్రశ్న .. చలాకీ చంటికీ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఎదురైంది. తాజాగా చలాకీ చంటి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. సుధీర్ విషయంపై చంటి స్పందిస్తూ .. ‘జబర్దస్త్’ను నిర్వహించే కంపెనీ వారు సుధీర్ ను అనేక రకాలుగా ప్రోత్సహించారు. అతను కారు .. ఇల్లు కొనుక్కోవడానికీ .. ఫారిన్ వెళ్లడానికి సాయపడ్డారు. అలాంటి సంస్థవారు సుధీర్ ను తీసేసినట్టుగా నేను విన్నాను. నాకు కూడా చాలా బాధ కలిగింది.
అయితే సుధీర్ కీ .. కంపెనీకి మధ్య ఏం జరిగింది? అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో నేను అక్కడ లేను. రెండు కారణాల వలన సుధీర్ ను పక్కన పెట్టేశారని చెప్పుకుంటున్నారు .. అవేమిటనేది కూడా నాకు తెలియదు. నా కళ్లతో చూస్తే నేను చెప్పేవాడినే. కానీ ఎవరో చెప్పినదానిని నమ్మి ఆ విషయాలను మీకు చెప్పలేను. ఇటు సుధీర్ ను గానీ .. అటు కంపెనీని గాని తప్పుపట్టలేం. ఎవరి ఇష్టం వాళ్లది అంటూ చెప్పుకొచ్చాడు.