చైతు సినిమాలో నాగ్, వెంకీ పాత్రలవేనా..?
మలయాళంలో సూపర్ హిట్ ను అందుకున్న ‘ప్రేమమ్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్
చేస్తున్నారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్
నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో వెంకీ, నాగార్జున
కనిపించనున్నారని టాక్. నిజానికి మలయాళంలో హీరో మావయ్య పాత్రలో రెంజీ పాణికర్
కనిపించగా ప్రిన్సిపాల్ పాత్రలో మనియన్ అనే నటుడు నటించాడు. తెలుగులో నాగార్జున
కాలేజ్ ప్రిన్సిపాల్ పాత్రలో కనిపించగా.. హీరో మావయ్య పాత్రలో వెంకటేష్ కనిపించనున్నాడని
ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పాత్రల నిడివి తక్కువ సమయం అయినా.. తెరపై వారు
కనిపించనంతసేపు అభిమానులు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నారు.