HomeTelugu Big Storiesభారత్‌లో 3 జోన్లుగా లాక్‌డౌన్‌...!

భారత్‌లో 3 జోన్లుగా లాక్‌డౌన్‌…!

8 11
భారత్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ ఈ నెల 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే లాక్‌డౌన్‌ను కనీసం మరో 2 వారాలపాటు పొడిగించాలని పలు రాష్ట్రాల సీఎంలు వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీని కోరారు. అయితే వ్యవసాయ రంగానికి వెసులుబాటు ఇవ్వాలని, రైతులను ఆదుకోవాలని కోరాయి. దీంతో పాటుగా దేశంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరుతో పాటు పలు కీలక అంశాలపై మోదీ చర్చించినట్టు తెలుస్తోంది. వాటిలో ముఖ్యంగా కరోనా కేసులను బట్టి ప్రాంతాలను జోన్లుగా విభజించే యోచనలో ఉన్నట్టు సమాచారం.

కరోనా వ్యాప్తిని బట్టి రెడ్‌ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ ఇలా 3 జోన్లుగా విభజించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని ప్రాంతాలను గ్రీన్‌జోన్ గా ప్రకటిస్తారట. ఎల్లుండితో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ పీరియడ్ ముగుస్తుండటంతో ప్రధాని మోడీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జోన్లపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. గ్రీన్ జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అవకాశం ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 400 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 15 కంటే తక్కువ కేసులు నమోదయి మళ్ళీ కొత్తగా కేసులు నమోదు కాకుంటే ఆ ప్రాంతాన్ని ఆరంజ్ జోన్ గా ఇక్కడ కొన్ని ఆంక్షలతో లాక్ డౌన్ కొనసాగించొచ్చు. 15 మించిన కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించి అక్కడ యథాతథంగా కఠిన ఆంక్షలతో లాక్‌డౌన్ ను కొనసాగించే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu